Sunday, February 6, 2011

ఒక తల్లి ఆశ



ఎక్కడో మామిడి గుబురుల్లో కోయిల కూసే రాగానికి పరవశిస్తూ,
కెంజాయిరంగు ఆకాశాన్ని చూస్తూ మనసులో ఒక రూపాన్ని గీసుకుని ఆరాధించే ముగ్ధమైన ఆడపిల్లని....
తన బాహువుల్లో పొదివి పట్టుకుని, 
పచ్చిక బైళ్ళనీ, కుందేలు పిల్లల్నీ మరిపించే సున్నితత్వంతో ఆమెని అలరించే ఒక పురుషుడికి జన్మనివ్వాలని వుంది.
భర్త అంటే ఒక ఆప్తమిత్రుడిగా, అమ్మగా, అన్నగా, నాన్నగా లాలించే గుణాలుకల మగవాడికి తల్లినవ్వాలని వుంది.
అతని సమక్షంలో నిశ్చింతగా ఆదమరిచి నిద్రపోగల ధీమానివ్వగల భర్తగా నా బిడ్డను పెంచాలని వుంది.

కల...