మళ్లీ వచ్చేసానోచ్!!! వచ్చీ రాగానే జోకులేస్తే ఈ పిల్లకి బొత్తిగా seriousness (తెలుగులో ఏమనాలో తట్టి చావలేదు మరి :( ) లేదు అనుకుంటారేమో అని ఈ పోస్ట్ రాసాను :D.
(నిజానికి క్రిందటి మదర్స్ డే కి రాసాను....కాని బ్లాగ్ ప్రారంభించింది మొన్ననే కదా. అందుకే ఇప్పుడు వేస్తున్నాను)
అదన్నమాట సంగతి....
ఎంతో మంది అమ్మ గురించి, అమ్మతనం గురించి, అమ్మతో వారి అనుబంధం గురించి ఎన్నో గొప్ప గొప్ప అంశాలను రాసారు...కాని అపురూపమైన ఆ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అందుకే నా మాటలలో.....
మాతృభాషలో మాతృమూర్తికి తొలి వందనం!!
దేవుడు తన ప్రతిరూపంగా అమ్మని సృష్టించాడంట. ఇది అక్షరాల నిజం.
అమ్మ ప్రేమకి ఆనకట్టలు ఉండవు కదా. అది అన్నిటికన్నా పవిత్రమైనది.
తేనె కన్న తీపి అమ్మ...
దేవుని మించిన దైవం అమ్మ...
ప్రేమకు ప్రతిరూపం అమ్మ...
అమ్మలోనే ఉన్నాయి లోకాలు అన్ని...
అమ్మనుంచి వచ్చాయి ఆనందాలు అన్ని...
ప్రతి మనిషికి మొదటి గురువు...
పేగు తెంచి ప్రాణం పోసి,
గోరు ముద్దలు తినిపించి,
నడకలు నేర్పించి,
అక్షరాలు దిద్దించి,
మాటలు పలికించి,
సంస్కారం పెంపొందించి,
ఒక మాంసపు ముద్దని - మనిషిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చి దిద్దే అమ్మ ప్రేమకి సాటి రాగలది ఈ ప్రపంచంలో ఇంకేమి లేదు.
(పైన ఉన్న తవిక చూసి మీకు "నువ్వు నాకు నచ్చావు" సినిమా లో ప్రకాష్ రాజ్ గారి కవితా సంపుటి గుర్తొస్తే మాత్రం నాకేమి సంబంధం లేదండోయ్...హి హి హి)
అమ్మతో నా అనుబంధం చెప్పాలని ఉంది.
21 సంవత్సరాలు అమ్మ దగ్గరే పెరిగాను. Job, career అంటూ అమ్మని వదిలి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది...రోజు అమ్మ చిరునవ్వు చూస్తూ నిద్రలేచే నాకు...ఇప్పుడు సంవత్సరానికి మూడు-నాలుగు సార్లు మాత్రమే అమ్మని చూడటం కుదురుతుంది.
తను నా బెస్ట్ ఫ్రెండ్. నా మొదటి శ్రేయోభిలాషి. నా చిన్నప్పటి నుంచి తను ఉద్యోగం చేస్తూనే, నా ప్రతి విషయంలోనూ పర్సనల్ కేర్ తీసుకుంటుంది. తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్ నాలో ఏ మాత్రం రానివ్వకుండా పెంచింది. తను తిన్నా తినకపోయినా నాకు ఏ లోటు లేకుండా ఉండాలని చూసింది. నాతో ఆటలు ఆడింది, చదివించింది, నా పరీక్షలప్పుడు నిద్ర కూడా మానేసి నాతో కూర్చునేది, ఫ్రెండ్ లా నాతో సినిమాలకి వచ్చింది. ఎండాకాలం తర్వాత పడే మొదటి వర్షంలో అమ్మ కైనెటిక్ హోండా మీద వెళ్తూ తడవటం మా ఇద్దరికీ ఎంతో ఇష్టం....అమ్మ డ్రైవ్ చేస్తుంటే నేను వెనక కుర్చుని తడుస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. I missed it from last three years.
చిన్నప్పుడు నాన్న వైపు ఫ్యామిలీ వల్ల ఏవో ఇబ్బందులు...నాన్న పట్టించుకునేవారు కాదు....కానీ ఎప్పుడూ వాటి ప్రభావం నా మీద పడనివ్వలేదు అమ్మ. అన్ని ఒంటరిగానే భరించింది. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి అనుకోండి...అయినా వెనక్కి తిరిగి చూసుకుంటే...తన ఓపికకి hatsoff చెప్పాలనిపిస్తుంది. ఒక్కసారి కూడా నా మీద చెయ్యి చేసుకోలేదు. అలా అని నేనేమి అల్లరి చెయ్యలేదు అనుకోకండేం!! ఒకవేళ మీరు అవల్రెడీగా అలా అనేసుకుంటే మాత్రం మళ్లీ మనసులూ గట్రా మార్చేసుకోకండి మరి. నేనేమి అనుకోను కద :D.
ఏమి చేస్తే అమ్మ రుణం తీర్చుకోగలను. అసలు రుణం అనే పదం తో అమ్మ ప్రేమని పోల్చడమే పాపం ఏమో. అది పదాలకి అతీతం...భాషకి అందని భావం.
అమ్మా!! నీకు పాదాభివందనం!!
ఒకసారి నా ఫ్రెండ్ ఒకరు అన్నారు...
"ప్రతి తల్లి ఒక విషయం మీద రెండు సార్లు ఆలోచిస్తుంది...
ఒకటి తన వైపు నుంచి ఇంకోటి తన బిడ్డ వైపు నుంచి...."
కల...