నిన్న ఇంటికెళ్ళేసరికి మా ఆంటీ బల్బు లా బ్రైటు ఫేసు వేసుకుని ఎదురొచ్చారు....
బుజ్జమ్మా.. అంకుల్ సినిమాకి టికెట్స్ తెచ్చారు రా...తొందరగా రెడీ అయిపో అని చెప్తే ఏం సినిమా అని కూడా అడగకుండా రెడీ అయిపోయి నేను,ఆంటీ,అంకుల్,ఇద్దరు బుడంకాయలు కలిసి కార్ ఎక్కి జుఈఈఈఈఈ మని హాల్ కి వెళ్ళగానే........
నాకు మొదటి పిడుగు పడింది : ఆ సినిమా పోస్టర్ చూసి. పేరు 'ఝుమ్మంది నాదం'
భయపడి నేను రాను మొర్రో అంటున్నా వినకుండా టికెట్ వేస్ట్ అయిపోతుందని మా ఆంటీ నన్ను లాక్కెల్లిపోయారు. సర్లే A/c లో కళ్ళు మూసుకుని నిద్రపోదాం అనుకున్నాను.
సినిమా మొదలయింది.....
నాకు రెండో పిడుగు : లక్ష్మీ ప్రసన్న అచ్చం గా వంకర తెలుగులో కామెంటరీ ఇస్తుంది సినిమాకి.... చీ వెధవ జీవితం అనుకుని కూర్చున్నాను.
ఖర్మ
దురదృష్టం ఫెవిక్విక్ రాసుకుని మరీ అంటుకుని ఉంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు.....ఎంత ట్రై చేసినా ఆ గోలకి నిద్ర రాలేదు.....2వ సీన్ లో మనోజ్ బాబు శపధం.....ఎందుకు చేసాడో ..... ఏం చేసాడో...... ఎలా చేసాడో తెలీదు కానీ శపధం మాత్రం చేసేసాడు.......కట్ చేస్తే హైదాబాద్ లో కల
మూడో పిడుగు : మోహన్ బాబు ఎంట్రీ
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పిడుగుల మీద పిడుగులు.....నెత్తి వాచి బొప్పి కట్టింది

ఆ డైలాగులేంటో
ఆ డాన్సులేంటో
ఆ పాటల్లో గాలిలో ఎగరడాలు ఏంటో
ఆ పెళ్ళిలో గంతులు ఏంటో
ఆ పాటల పోటీలు ఏంటో
సినిమాని మాత్రం ఏ అంశం లోనూ సహజత్వానికి కనుచూపు మేరలో లేకుండా జాగ్రత్త పడ్డారు అని అనిపించింది.కోపం, బాధ, విరక్తి, అసహ్యం, నా మీద నాకే జాలి, నిర్లిప్తత, నొప్పి, భయం, వణుకు, దడ, గాభరా, జడుపు, వికారం, బెంగ........ఇంకా ఒక రెండు-మూడు వేల రకాల, పేరు కూడా తెలియని వింత ఫీలింగ్స్ కలిగాయి నాకు, ఆ సినిమా అయ్యే లోపు (నాలో ఇన్ని రకాల భావాలు ఉన్నాయని నాకు కూడా అప్పుడే తెలిసింది)
దేశమంటే.... పాట తప్పించి ఒక్క ఐదు నిముషాలు కూడా చూడగలిగేలా లేదు సినిమా......I felt like I was watching a B-Grade movie with very low production values directed by an amateur director with hopeless skills. (no offense meant to Mr.KRR)
KRR గారి మూవీ మేకింగ్ లో ఎందుకింత downfall? ఎన్నో అంచనాలతో మొదలైన సినిమా ఇంత దారుణంగా మారటానికి కారణాలేమిటో తెలీదు కానీ.......పాత కధని అరిగిపోయి బూజు పట్టిన స్క్రీన్ప్లేతో కలిపి పెద్ద తింగరి మంగళ గందరగోళంగా తయారు చేసారు.
రాత్రి కలలో కూడా ఆ సినిమానే వచ్చి జడుచుకుని లేచి కూర్చున్నాను.....కాసేపు చుట్టూ చూసుకుని సేఫ్ గా ఇంట్లోనే ఉన్నాను అని కన్ఫర్మ్ చేసుకున్నాక మంచి నీళ్ళు తాగి మళ్లీ పడుకున్నాను.
ఇంకా ఏం అనాలో కూడా తెలియట్లేదు నాకు, ఈ సినిమా గురించి .......
దేవుడా.....ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కక్ష 
కల...

