Wednesday, July 14, 2010

యే జన్మలో యే పాపం చేసానో మరి :(


నిన్న ఇంటికెళ్ళేసరికి మా ఆంటీ బల్బు లా బ్రైటు ఫేసు వేసుకుని ఎదురొచ్చారు....

బుజ్జమ్మా.. అంకుల్ సినిమాకి టికెట్స్ తెచ్చారు రా...తొందరగా రెడీ అయిపో అని చెప్తే ఏం సినిమా అని కూడా అడగకుండా రెడీ అయిపోయి నేను,ఆంటీ,అంకుల్,ఇద్దరు బుడంకాయలు కలిసి కార్ ఎక్కి జుఈఈఈఈఈ  మని హాల్ కి వెళ్ళగానే........

నాకు మొదటి పిడుగు పడింది : ఆ సినిమా పోస్టర్ చూసి. పేరు 'ఝుమ్మంది నాదం'
భయపడి నేను రాను మొర్రో అంటున్నా వినకుండా టికెట్ వేస్ట్ అయిపోతుందని మా ఆంటీ నన్ను లాక్కెల్లిపోయారు. సర్లే A/c లో కళ్ళు మూసుకుని నిద్రపోదాం అనుకున్నాను.

సినిమా  మొదలయింది.....

నాకు రెండో పిడుగు : లక్ష్మీ ప్రసన్న అచ్చం గా వంకర తెలుగులో కామెంటరీ ఇస్తుంది సినిమాకి.... చీ వెధవ జీవితం అనుకుని కూర్చున్నాను.
ఖర్మ దురదృష్టం ఫెవిక్విక్ రాసుకుని మరీ అంటుకుని ఉంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు.....ఎంత ట్రై చేసినా ఆ గోలకి నిద్ర రాలేదు.....
2వ  సీన్ లో మనోజ్ బాబు శపధం.....ఎందుకు చేసాడో ..... ఏం చేసాడో...... ఎలా చేసాడో తెలీదు కానీ శపధం మాత్రం చేసేసాడు.......కట్ చేస్తే హైదాబాద్ లో కల

మూడో పిడుగు : మోహన్ బాబు ఎంట్రీ
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పిడుగుల మీద పిడుగులు.....నెత్తి వాచి బొప్పి కట్టింది

ఆ డైలాగులేంటో ఆ డాన్సులేంటో  ఆ పాటల్లో గాలిలో ఎగరడాలు ఏంటో  ఆ పెళ్ళిలో గంతులు ఏంటో  ఆ పాటల పోటీలు ఏంటో    సినిమాని మాత్రం ఏ అంశం లోనూ సహజత్వానికి కనుచూపు మేరలో లేకుండా జాగ్రత్త పడ్డారు అని అనిపించింది.

కోపం, బాధ, విరక్తి, అసహ్యం, నా మీద నాకే జాలి, నిర్లిప్తత, నొప్పి, భయం, వణుకు, దడ, గాభరా, జడుపు, వికారం, బెంగ........ఇంకా ఒక రెండు-మూడు వేల రకాల, పేరు కూడా తెలియని వింత ఫీలింగ్స్ కలిగాయి నాకు, ఆ సినిమా అయ్యే లోపు (నాలో ఇన్ని రకాల భావాలు ఉన్నాయని నాకు కూడా అప్పుడే తెలిసింది)

దేశమంటే.... పాట తప్పించి ఒక్క ఐదు నిముషాలు కూడా చూడగలిగేలా లేదు సినిమా......I felt like I was watching a B-Grade movie with very low production values directed by an amateur director with hopeless skills. (no offense meant to Mr.KRR)

KRR గారి మూవీ మేకింగ్ లో ఎందుకింత downfall? ఎన్నో అంచనాలతో మొదలైన సినిమా ఇంత దారుణంగా మారటానికి కారణాలేమిటో తెలీదు కానీ.......పాత కధని అరిగిపోయి బూజు పట్టిన స్క్రీన్ప్లేతో కలిపి  పెద్ద తింగరి మంగళ గందరగోళంగా తయారు చేసారు.

రాత్రి  కలలో కూడా ఆ సినిమానే వచ్చి  జడుచుకుని  లేచి  కూర్చున్నాను.....కాసేపు  చుట్టూ  చూసుకుని  సేఫ్ గా  ఇంట్లోనే ఉన్నాను అని కన్ఫర్మ్ చేసుకున్నాక మంచి నీళ్ళు తాగి మళ్లీ పడుకున్నాను.

ఇంకా ఏం అనాలో  కూడా తెలియట్లేదు నాకు, ఈ సినిమా గురించి .......

దేవుడా.....ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కక్ష 

కల...


Tuesday, July 13, 2010

అమ్మ...


మళ్లీ వచ్చేసానోచ్!!! వచ్చీ రాగానే జోకులేస్తే ఈ పిల్లకి బొత్తిగా seriousness (తెలుగులో ఏమనాలో తట్టి చావలేదు మరి :( ) లేదు అనుకుంటారేమో అని ఈ పోస్ట్ రాసాను :D.
(నిజానికి క్రిందటి మదర్స్ డే కి రాసాను....కాని బ్లాగ్ ప్రారంభించింది మొన్ననే కదా. అందుకే ఇప్పుడు వేస్తున్నాను)
అదన్నమాట సంగతి....

ఎంతో మంది అమ్మ గురించి, అమ్మతనం గురించి, అమ్మతో వారి అనుబంధం గురించి ఎన్నో గొప్ప గొప్ప అంశాలను రాసారు...కాని అపురూపమైన ఆ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అందుకే నా మాటలలో.....
మాతృభాషలో మాతృమూర్తికి తొలి వందనం!!

దేవుడు తన ప్రతిరూపంగా అమ్మని సృష్టించాడంట. ఇది అక్షరాల నిజం.
అమ్మ ప్రేమకి ఆనకట్టలు ఉండవు కదా. అది అన్నిటికన్నా పవిత్రమైనది.

తేనె కన్న తీపి అమ్మ...
దేవుని మించిన దైవం అమ్మ...
ప్రేమకు ప్రతిరూపం అమ్మ...
అమ్మలోనే ఉన్నాయి లోకాలు అన్ని...
అమ్మనుంచి వచ్చాయి ఆనందాలు అన్ని...

ప్రతి మనిషికి మొదటి గురువు...
పేగు తెంచి ప్రాణం పోసి,
గోరు ముద్దలు తినిపించి,
నడకలు నేర్పించి,
అక్షరాలు దిద్దించి,
మాటలు పలికించి,
సంస్కారం పెంపొందించి,
ఒక మాంసపు ముద్దని - మనిషిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చి దిద్దే అమ్మ ప్రేమకి సాటి రాగలది ఈ ప్రపంచంలో ఇంకేమి లేదు.
(పైన ఉన్న తవిక చూసి మీకు "నువ్వు నాకు నచ్చావు" సినిమా లో ప్రకాష్ రాజ్ గారి కవితా సంపుటి గుర్తొస్తే మాత్రం నాకేమి సంబంధం లేదండోయ్...హి హి హి)

అమ్మతో నా అనుబంధం చెప్పాలని ఉంది.
21 సంవత్సరాలు అమ్మ దగ్గరే పెరిగాను. Job, career అంటూ అమ్మని వదిలి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది...రోజు అమ్మ చిరునవ్వు చూస్తూ నిద్రలేచే నాకు...ఇప్పుడు సంవత్సరానికి మూడు-నాలుగు సార్లు మాత్రమే అమ్మని చూడటం కుదురుతుంది.
తను నా బెస్ట్ ఫ్రెండ్. నా మొదటి శ్రేయోభిలాషి. నా చిన్నప్పటి నుంచి తను ఉద్యోగం చేస్తూనే, నా ప్రతి విషయంలోనూ పర్సనల్ కేర్ తీసుకుంటుంది. తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్ నాలో ఏ మాత్రం రానివ్వకుండా పెంచింది. తను తిన్నా తినకపోయినా నాకు ఏ లోటు లేకుండా ఉండాలని చూసింది. నాతో ఆటలు ఆడింది, చదివించింది, నా పరీక్షలప్పుడు నిద్ర కూడా మానేసి నాతో కూర్చునేది, ఫ్రెండ్ లా నాతో సినిమాలకి వచ్చింది. ఎండాకాలం తర్వాత పడే మొదటి వర్షంలో అమ్మ కైనెటిక్ హోండా మీద వెళ్తూ తడవటం మా ఇద్దరికీ ఎంతో ఇష్టం....అమ్మ డ్రైవ్ చేస్తుంటే నేను వెనక కుర్చుని తడుస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. I missed it from last three years.

చిన్నప్పుడు నాన్న వైపు ఫ్యామిలీ వల్ల ఏవో ఇబ్బందులు...నాన్న పట్టించుకునేవారు కాదు....కానీ ఎప్పుడూ వాటి ప్రభావం నా మీద పడనివ్వలేదు అమ్మ. అన్ని ఒంటరిగానే భరించింది. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి అనుకోండి...అయినా వెనక్కి తిరిగి చూసుకుంటే...తన ఓపికకి hatsoff చెప్పాలనిపిస్తుంది. ఒక్కసారి కూడా నా మీద చెయ్యి చేసుకోలేదు. అలా అని నేనేమి అల్లరి చెయ్యలేదు అనుకోకండేం!! ఒకవేళ మీరు అవల్రెడీగా అలా అనేసుకుంటే మాత్రం మళ్లీ మనసులూ గట్రా మార్చేసుకోకండి మరి. నేనేమి అనుకోను కద :D.

ఏమి చేస్తే అమ్మ రుణం తీర్చుకోగలను. అసలు రుణం అనే పదం తో అమ్మ ప్రేమని పోల్చడమే పాపం ఏమో. అది పదాలకి అతీతం...భాషకి అందని భావం.

అమ్మా!! నీకు పాదాభివందనం!!       

ఒకసారి నా ఫ్రెండ్ ఒకరు అన్నారు...
"ప్రతి తల్లి ఒక విషయం మీద రెండు సార్లు ఆలోచిస్తుంది...
ఒకటి తన వైపు నుంచి ఇంకోటి తన బిడ్డ వైపు నుంచి...."

కల...



          

Sunday, July 11, 2010

జింగు చక హే హే!!




కలయా....నిజమా?? తొలి పోస్టు వేయు మహిమా... ఆహా!! :D

రాసేసా
!! మొత్తానికి మొదటి పోస్ట్ రాసేసా!! తెలుగు బ్లాగులు చదవటం మొదలుపెట్టి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది... ఇప్పటికైనా నేను ఒక బ్లాగ్ మొదలుపెట్టక పోతే ఇంక నా జీవితం వ్యర్ధం అనిపించేసింది... అందుకే చక చక బ్లాగర్ లో sign in చేసేసాను.

సరే ఇంత ఉత్సాహంగా ఒచ్చేసాం కదా...ఇంక మన బ్లాగ్ పుట్టేసినట్టే...అబ్బబ్బో....జింగు చక హే హే!! అని అనుకుంటుంటే.....blogspot అంతర్వాణి "అర్భకురాలా! ఎందుకే ఆ మిడిసిపాటు...నీకు అంత సీను లేదోచ్చ్....ముందు బ్లాగ్ కి టైటిల్ ఒకటి ఏస్కో" అని చెప్పి డింగు మని మాయమైపోయింది.

అంతట నా ఫేసుని యధా శక్తి దుఃఖంగా పెట్టుకుని :( అమ్మనాయనోయ్ మనం ముందుగా టైటిల్ ఏమీ ఆలోచించుకోకుండా ఎగేసుకుని ఒచ్చేసామే!! ఇప్పుడెలా సుమీ!! అనుకుంటూ బుర్ర గోక్కుంటుంటే...ఆ గోకుడు యొక్క రాపిడికి పుట్టిన విధ్యుతైస్కాంత శక్తికి (తెలుగు ఎక్కువైతే దయచేసి సెమించాలి అయ్యోరులు) "Mentos...దిమాగ్ కి బత్తి జల్ గయా" అన్నమాట :p. 'జల్ గయా' అంటే కాలి బూడిదైపోయిందని.....ఇంక ఈ పిల్ల మనల్ని వదిలేసిందని డాన్సులేమి వెయ్యక్కర్లేదు లెండి....మీ అదృష్టం బాగోక అది జస్ట్ వెలిగి ఊరుకుంది.....హి హి హి

ఇక్కడ బల్బు : చిన్నప్పుడు వీణ క్లాసులో ఉండగా అమ్మ నాకు తీసిన ఫోటో కనిపించింది టేబుల్ మీద. వీణా నాదం ఎంతో శ్రావ్యంగా సుమధురంగా ఉంటుంది కదా! ప్రతి అమ్మాయి హృదయం లోంచి జాలువారే ఆలోచనలు కూడా అలాగే వీణానాదం లా...అదే అదే...అచ్చంగా నాలా (ఇక్కడ ప్రూఫులు అవ్వి అడగకూడదు మరి....హన్నా!!)

సో...ఆ విధంగా బల్బు వెలిగిందన్నమాట. అందుకే నా "హృదయ వీణ" అని పేరు పెట్టేసాను. ఆ వెంటనే టెంప్లేట్ సెలెక్ట్ చేసేసాను....ఆ వెంటనే......ఖర్మ!! వాఆఆఆఆఆ మల్లి బ్రేక్ :(. ఈసారి ప్రొఫైల్ నేమ్. ఇది కొంచెం వీజీ గానే తట్టేసింది లెండి. మనం(అంటే నేను) రోజు చేసే పని ఏంటి...తిండి తిన్నా తినకపోయినా...ఆఫీసుకి వెళ్లి పని చేసిన చెయ్యకపోయినా...కళ్ళు తెరిచి ఉన్నా మూసుకుని ఉన్నా...గ్యాప్ లేకుండా కలలు కనేయ్యటమే కదా...అందుకే ఆ కలల సమూహంలో ఒక దానిని పట్టుకుని నా ప్రొఫైల్ నేమ్ గా పెట్టేసా....మళ్లీ హి హి హి

అదన్నమాట సంగతి.....ఇంక నా హృదయ వీణని ఆగకుండా వాయిన్చేస్తాను అన్నమాట...మీరు వినిపెట్టుకోవాలి అన్నమాట...ఇంకోసారి హి హి హి అని పళ్ళు ఇకిలిస్తే తంతారేమో ...ఇప్పటికే చాట భారతం బాగా ఎక్కువయింది

భవదీయులు నా బ్లాగ్ చదివి నన్ను ఆసీర్వదించ ప్రార్థన
(spelling mistakes to be excused)
వస్తా... మల్లొస్తా... అప్పటివరకు...
స్వీట్ డ్రీమ్స్!!
కల...