Sunday, July 11, 2010

జింగు చక హే హే!!




కలయా....నిజమా?? తొలి పోస్టు వేయు మహిమా... ఆహా!! :D

రాసేసా
!! మొత్తానికి మొదటి పోస్ట్ రాసేసా!! తెలుగు బ్లాగులు చదవటం మొదలుపెట్టి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది... ఇప్పటికైనా నేను ఒక బ్లాగ్ మొదలుపెట్టక పోతే ఇంక నా జీవితం వ్యర్ధం అనిపించేసింది... అందుకే చక చక బ్లాగర్ లో sign in చేసేసాను.

సరే ఇంత ఉత్సాహంగా ఒచ్చేసాం కదా...ఇంక మన బ్లాగ్ పుట్టేసినట్టే...అబ్బబ్బో....జింగు చక హే హే!! అని అనుకుంటుంటే.....blogspot అంతర్వాణి "అర్భకురాలా! ఎందుకే ఆ మిడిసిపాటు...నీకు అంత సీను లేదోచ్చ్....ముందు బ్లాగ్ కి టైటిల్ ఒకటి ఏస్కో" అని చెప్పి డింగు మని మాయమైపోయింది.

అంతట నా ఫేసుని యధా శక్తి దుఃఖంగా పెట్టుకుని :( అమ్మనాయనోయ్ మనం ముందుగా టైటిల్ ఏమీ ఆలోచించుకోకుండా ఎగేసుకుని ఒచ్చేసామే!! ఇప్పుడెలా సుమీ!! అనుకుంటూ బుర్ర గోక్కుంటుంటే...ఆ గోకుడు యొక్క రాపిడికి పుట్టిన విధ్యుతైస్కాంత శక్తికి (తెలుగు ఎక్కువైతే దయచేసి సెమించాలి అయ్యోరులు) "Mentos...దిమాగ్ కి బత్తి జల్ గయా" అన్నమాట :p. 'జల్ గయా' అంటే కాలి బూడిదైపోయిందని.....ఇంక ఈ పిల్ల మనల్ని వదిలేసిందని డాన్సులేమి వెయ్యక్కర్లేదు లెండి....మీ అదృష్టం బాగోక అది జస్ట్ వెలిగి ఊరుకుంది.....హి హి హి

ఇక్కడ బల్బు : చిన్నప్పుడు వీణ క్లాసులో ఉండగా అమ్మ నాకు తీసిన ఫోటో కనిపించింది టేబుల్ మీద. వీణా నాదం ఎంతో శ్రావ్యంగా సుమధురంగా ఉంటుంది కదా! ప్రతి అమ్మాయి హృదయం లోంచి జాలువారే ఆలోచనలు కూడా అలాగే వీణానాదం లా...అదే అదే...అచ్చంగా నాలా (ఇక్కడ ప్రూఫులు అవ్వి అడగకూడదు మరి....హన్నా!!)

సో...ఆ విధంగా బల్బు వెలిగిందన్నమాట. అందుకే నా "హృదయ వీణ" అని పేరు పెట్టేసాను. ఆ వెంటనే టెంప్లేట్ సెలెక్ట్ చేసేసాను....ఆ వెంటనే......ఖర్మ!! వాఆఆఆఆఆ మల్లి బ్రేక్ :(. ఈసారి ప్రొఫైల్ నేమ్. ఇది కొంచెం వీజీ గానే తట్టేసింది లెండి. మనం(అంటే నేను) రోజు చేసే పని ఏంటి...తిండి తిన్నా తినకపోయినా...ఆఫీసుకి వెళ్లి పని చేసిన చెయ్యకపోయినా...కళ్ళు తెరిచి ఉన్నా మూసుకుని ఉన్నా...గ్యాప్ లేకుండా కలలు కనేయ్యటమే కదా...అందుకే ఆ కలల సమూహంలో ఒక దానిని పట్టుకుని నా ప్రొఫైల్ నేమ్ గా పెట్టేసా....మళ్లీ హి హి హి

అదన్నమాట సంగతి.....ఇంక నా హృదయ వీణని ఆగకుండా వాయిన్చేస్తాను అన్నమాట...మీరు వినిపెట్టుకోవాలి అన్నమాట...ఇంకోసారి హి హి హి అని పళ్ళు ఇకిలిస్తే తంతారేమో ...ఇప్పటికే చాట భారతం బాగా ఎక్కువయింది

భవదీయులు నా బ్లాగ్ చదివి నన్ను ఆసీర్వదించ ప్రార్థన
(spelling mistakes to be excused)
వస్తా... మల్లొస్తా... అప్పటివరకు...
స్వీట్ డ్రీమ్స్!!
కల...





1 comment:

  1. haa chala blogs chadivanu kani. mee blog chaala bagundi. keep going. meeru raase vidaanam, nee saili, witty gaa mee maatalu chaala bgunay really impressive.

    ReplyDelete